CBI: సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద హై డ్రామా... నలుగురిని అరెస్ట్ చేసిన అధికారులు!

  • అలోక్ వర్మ ఇంటి ముందు హైడ్రామా
  • ఇంట్లోకి చొరబడేందుకు నలుగురి యత్నం
  • నలుగురి వద్దా ఐబీ ఐడీ కార్డులు
  • అదుపులోకి తీసుకున్న జవాన్లు

సీబీఐ మాజీ డైరెక్టర్, రెండు రోజుల క్రితం పదవీచ్యుతుడైన అలోక్ వర్మ ఇంటి వద్ద ఈ రోజు హై డ్రామా చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐడీ కార్డులతో వచ్చి, అలోక్ వర్మ నివాసం వద్ద తచ్చాడుతుండడంతో, వారిపై సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అవుతున్నారని భావించిన ఈ నలుగురూ, పలాయనం చిత్తగించేందుకు ప్రయత్నించారు.

 అక్కడే ఉన్న ఇతర సిబ్బంది, జవాన్లు, వారిని అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. అలోక్ వర్మ ఇంటి ముందు హైడ్రామా చోటు చేసుకోగా, నిందితులను రోడ్డుపై పట్టుకుని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. కాగా, తనను అక్రమంగా తొలగించారంటూ సుప్రీంకోర్టులో అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనున్న సంగతి తెలిసిందే.

More Telugu News