Telangana: ఇకపై ఓటేసే సమయంలో బురఖా తొలగించాల్సిన అవసరం లేదు!

  • డిసెంబర్ 7 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
  • పురుష అధికారుల ముందు బురఖా తీయక్కర్లేదు
  • స్వయంగా వెల్లడించిన ఓపీ రావత్

డిసెంబర్ 7న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చే ముస్లిం మహిళలు, గుర్తింపు కోసం అధికారుల ముందు తమ బురఖాను తొలగించాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. పురుష పోలింగ్ అధికారుల ముందు వారు బురఖాను తీయాల్సిన అవసరం లేదని, మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తాను అధికారులను ఆదేశించానని ఆయన తెలిపారు.

తెలంగాణలో ముస్లిం మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా సిబ్బందిని, బందోబస్తుకు మహిళా పోలీసులను నియమించాలని నిర్ణయించామని తెలిపారు. పింక్ పోలింగ్ కేంద్రాల స్థానంలో ఎటువంటి రంగూ లేని పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేస్తామని రావత్ తెలిపారు.

More Telugu News