China: చైనాలో కుటుంబ నియంత్రణకు చెల్లు.. నిషేధాన్ని ఎత్తివేయనున్న డ్రాగన్ కంట్రీ

  • సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న చైనా
  • కుటుంబ నియంత్రణపై ఉన్న నిబంధనలు ఎత్తివేయనున్న ప్రభుత్వం
  • వృద్ధులతో బాధపడుతున్న కమ్యూనిస్టు కంట్రీ

సంచలన నిర్ణయం దిశగా చైనా అడుగులు వేస్తోంది. వృద్ధ దేశంగా మారుతున్న చైనాలో ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది. జననాల విషయంలో ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను ఎత్తివేసి ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని భావిస్తోంది. జనాభాను నియంత్రించేందుకు దశాబ్దాలుగా విధించిన నిబంధనలను చెత్తబుట్టలో పడేయాలని యోచిస్తోంది. పాప్యులేషన్ మోనిటరింగ్ అండ్ ఫ్యామిలీ డెవలప్‌మెంట్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ వీ యన్‌పెంగ్‌ను ఉటంకిస్తూ చైనా మీడియా ఈ మేరకు కథనాలు ప్రచురించింది.

గతవారం బీజింగ్‌లో జరిగిన ఐరాస  పాప్యులేషన్ ఫండ్ కాన్ఫరెన్స్‌లో దేశంలోని జననాల విధానాలకు సంబంధించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో ఇందుకు సంబంధించిన స్పష్టమైన ప్రకటనను ప్రభుత్వం వెలువరించే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే చైనీయులకు ఇంతకుమించిన శుభవార్త ఇంకోటి ఉండదేమో.

కాగా, 1960 నుంచి చూసుకుంటే చైనాలో సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోయింది. ఫలితంగా దేశం వృద్ధులు, చిన్న పిల్లలతో నిండిపోతోంది. యువకుల జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. చైనాలో ప్రస్తుతం పురుషుల కంటే 30 మిలియన్ల మంది మహిళలు తక్కువగా ఉండడం ఆ దేశాన్ని వేధిస్తోంది.

More Telugu News