Vizag: విశాఖకు ఐటీ అధికారులు వచ్చారన్న విషయం ముందుగానే ఎలా తెలిసిందంటే..!

  • అధికారుల కోసం హోటళ్లలో గదులు
  • ఐడీ కార్డులను అడిగిన హోటల్ సిబ్బంది
  • వచ్చింది ఐటీ అధికారులేనన్న విషయం బయటకు

విశాఖపట్నంలోని పలు కంపెనీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా, దాడులు చేసి, సోదాలు జరిపేందుకు నాలుగు రాష్ట్రాల నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీగా వచ్చారని నిన్న సాయంత్రం నుంచే మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఎప్పుడు, ఎక్కడ దాడులకు వెళ్లినా విషయాన్ని రహస్యంగా ఉంచే అధికారులు, విశాఖకు వచ్చినప్పుడు మాత్రం ముందే బయటపడిపోయారు.

ఐటీ అధికారులు బస చేసేందుకు హోటల్స్ లో ముందే గదులు బుక్ కాగా, వాటిలోకి అధికారులు వెళుతున్న వేళ, హోటళ్ల సిబ్బంది గుర్తింపు కార్డులు చూపాలని కోరడంతోనే వాళ్లు ఐటీ అధికారులన్న విషయం బయటకు వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు వచ్చి మకాం వేశారన్న వార్త పలు హోటళ్ల సిబ్బంది నుంచే బయటకు పొక్కినట్టు తెలుస్తోంది. ఇక నగరంలోని పలువురు ప్రముఖులు ఆదాయపు పన్నులను సక్రమంగా చెల్లించడంలేదన్న సమాచారాన్ని సేకరించిన ఐటీ శాఖ, ఈ దాడులకు నిర్ణయించిందని సమాచారం.

More Telugu News