USA: ఒబామా, హిల్లరీ ఇళ్లకు కొరియర్ లో పేలుడు పదార్థాలు... ముందే తెలుసుకుని పేల్చేసిన సీక్రెట్ సర్వీస్!

  • పార్శిల్ బాంబులతో తీవ్ర కలకలం
  • ముందస్తు తనిఖీల్లో గుర్తించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు
  • సీఎన్ఎన్, న్యూయార్క్ కార్యాలయంలో కూడా!

యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి, ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఇళ్లకు పేలుడు పదార్థాలు కొరియర్ లో రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజంట్స్ వాటిని అడ్డుకుని పేల్చేశారు. గుర్తు తెలియని దుండగుల నుంచి ఈ కొరియర్ పార్శిల్స్ రాగా, రోజువారీ బట్వాడా ముందు వీటిని తనిఖీ చేస్తుండగా, అందులో పేలుడు పదార్థాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒబామా, హిల్లరీలకు ఎలాంటి ముప్పు లేదని అన్నారు. ఒబామా పేరిట వచ్చిన పార్శిల్ ను వాషింగ్టన్ లో, హిల్లరీ అడ్రస్ కు వచ్చిన పార్శిల్ ను న్యూయార్క్ లో గుర్తించినట్టు వెల్లడించారు.

ఇదిలావుండగా, సీఎన్ఎన్ వార్తాసంస్థ బిల్డింగ్ కు అనుమానాస్పద పార్శిల్ రావడంతో న్యూయార్క్ లోని బ్యూరో భవనాన్ని ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్, ఎఫ్బీఐలకి సమాచారం ఇచ్చారు. ముందు జాగ్రత్తగా ప్రపంచంలోని అన్ని సీఎన్ఎన్ కార్యాలయాల్లో తనిఖీలు చేయించినట్టు సంస్థ ప్రెసిడెంట్ జెఫ్ జుకర్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై యూఎస్ఎస్ ఎంక్వయిరీ ప్రారంభించింది. విషయం తెలుసుకున్న వైట్ హౌస్, ఈ దాడి యత్నాలను ఖండించింది. పేలుడు పదార్థాలు బయటపడటంపై ట్రంప్ కు సమాచారం అందిందని, ఈ తరహా ఘటనలకు బాధ్యులైన వారిని శిక్షిస్తామని పేర్కొంది.

More Telugu News