Indigo: ఇండిగో దీపావళి ఆఫర్: రూ.899కే విమాన టికెట్... 64 గమ్య స్థానాలకు!

  • 24-26 మధ్య టికెట్లను బుక్ చేసుకోవచ్చు
  • ఈ ఆఫర్ కింద 10 లక్షల సీట్లు
  • 64 గమ్య స్థానాలకు ఆఫర్ వర్తింపు 

దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో రూ.899కే టికెట్ అందిస్తోంది. అయితే దేశీయ, విదేశీ నాన్ స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ టికెట్లను బుక్ చేసుకునేందుకు ఇండిగో సంస్థ మూడు రోజుల పాటు అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 24-26 మధ్య ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ను మాత్రం నవంబర్ 8, 2018 నుంచి ఏప్రిల్ 15, 2019 మధ్య ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు.

ఈ ఆఫర్ కింద 10 లక్షల సీట్లను కేటాయించినట్టు ఇండిగో ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఇండిగో చీఫ్‌ కమర్షియల్‌ అధికారి మాట్లాడుతూ.. ఫెస్టివల్ సేల్ కింద ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరకే టికెట్ అందజేస్తున్నామన్నారు. ఇండిగో ప్రయాణించే 64 గమ్య స్థానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని.. ఎయిర్ పోర్ట్ చార్జీలు, ప్రభుత్వ పన్నుల మీద ఎటువంటి రాయితీ ఉండబోదన్నారు. అయితే ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన టికెట్లు రద్దు చేసుకుంటే డబ్బు తిరిగి రాదు.

More Telugu News