ntr: 'అరవింద సమేత' 11 రోజుల వసూళ్లు

  • ఈ నెల 11న వచ్చిన 'అరవింద'
  • హిట్ కొట్టేసిన ఎన్టీఆర్ 
  • 11 రోజుల్లో 91 కోట్లకి పైగా షేర్

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత వీర రాఘవ' ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా, తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దసరా రోజుల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 11 రోజుల్లో 69 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 91 కోట్ల షేర్ మార్క్ ను దాటడం విశేషం. ఇన్ని రోజుల్లో ఇంతవేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఎన్టీఆర్ కెరియర్లో ఇదే ఫస్టు టైమ్ అని అంటున్నారు. ఓవర్సీస్ వసూళ్ల విషయంలోను ఈ సినిమా రికార్డును సృష్టించింది.

త్రివిక్రమ్ ఇమేజ్ .. ఎన్టీఆర్ క్రేజ్ .. కథాకథనాలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూజా హెగ్డే గ్లామర్ .. తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని నమోదు చేయడం పట్ల ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News