Australia: ఓవైపు ఆస్ట్రేలియా, మరోవైపు పాకిస్తాన్.. మధ్యలో ‘బిస్కెట్ కప్’.. సెటైర్లు వేస్తున్న నెటిజన్లు!

  • విచిత్రంగా ట్రోఫిని డిజైన్ చేసిన నిర్వాహకులు
  • నేటి నుంచి అబుదాబీలో టీ20 సిరీస్
  • ఫన్నీగా స్పందించిన ఐసీసీ

దాయాది దేశం పాకిస్తాన్, ఆస్ట్రేలియాల మధ్య నేటి నుంచి మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. యూఏఈలోని అబుదాబిలో మ్యాచ్ లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న దానికంటే టోర్నీ విజేతలకు ఇచ్చే టోఫ్రీ గురించే ఆస్ట్రేలియా-పాకిస్తాన్ అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. టోర్నీ నిర్వాహకులు ఈ ట్రోఫీని విచిత్రంగా రూపొందించడమే అందుకు కారణం.

సాధారణంగా ఎక్కడైనా బ్యాట్, బాల్ లేదా వికెట్ల ఆకారం కలిసి వచ్చేలా ట్రోఫీని తయారుచేస్తారు. అయితే  సిరీస్ కోసం మాత్రం మూడు వికెట్లపై ‘పేద్ద బిస్కెట్’ ఉండేలా టీయూసీ కప్ ను డిజైన్ చేశారు. టీ20 సిరీస్‌ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు ఆరోన్‌ ఫించ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఈ ట్రోఫీని అబుదాబిలో ఆవిష్కరించారు. దీంతో ఇంటర్నెట్ లో ట్రోఫీపై సెటైర్లు మొదలయ్యాయి. దీనిపై ఐసీసీ కూడా స్పందిస్తూ.. ‘బిస్కెట్ ఇవ్వడంలో, తీసుకోవడంలో కొత్త అర్థం ఉంటుంది’ అని ట్వీట్ చేసింది. దీంతో ఇంటర్నెట్ లో నెటిజన్లు జోకుల మీద జోకులు పేల్చుతున్నారు. ఇది నిజమైన ట్రోఫీయేననీ, ఫొటోషాప్ ఎంతమాత్రం కాదని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News