sabarimala: శబరిమల ఎఫెక్ట్.. ఆలయానికి వెళ్లిన రెహానా ఫాతిమాపై బీఎస్ఎన్ఎల్ బదిలీ వేటు!

  • మాస పూజల సందర్భంగా ఆలయానికి వెళ్లిన రెహానా
  • అడ్డుకున్న అయ్యప్ప భక్తులు
  • ఆందోళనల నేపథ్యంలో అప్రాధాన్య పోస్టుకు బదిలీ

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చని గత నెలలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ పలు హిందూ సంఘాలు ఆలయానికి వెళ్లే దారిలో ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు మహిళా హక్కుల కార్యకర్త, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి రెహానా ఫాతిమా ప్రయత్నించినప్పటికీ, ఆందోళన కారులు ఆమెను అడ్డుకున్నారు. తాజాగా బీఎస్ఎన్ఎల్ సంస్థ రెహానాకు షాకిచ్చింది. ఆమెను కొచ్చిలోని పళరివట్టమ్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఎటువంటి ప్రజా సంప్రదింపులు అవసరం లేని ఎక్స్ఛేంజ్ అయిన పళరివట్టమ్ కు ఆమెను పంపారు. ఇప్పటివరకూ రెహానా కొచ్చిలోని బోట్ జెట్టి శాఖలో కస్టమర్ రిలేషన్ విభాగంలో టెక్నీషియన్ గా పనిచేస్తోంది. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చూపకపోయినా, వివాదాల నేపథ్యంలోనే ఆమెను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, కొన్నిరోజుల క్రితం రెహానాను తప్పించాలంటూ శబరిమల కర్మ సమితి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించింది. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆమెను ముస్లిం సమాజం నుంచి బహిష్కరిస్తున్నట్లు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ పేర్కొంది.

More Telugu News