vijay: 'సర్కార్ ' తో విజయ్ కెరియర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖాయమట!

  • విజయ్ హీరోగా 'సర్కార్'
  • దీపావళికి ప్రేక్షకుల ముందుకు 
  • కేరళలోను భారీ రిలీజ్

కోలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 'సర్కార్' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. విజయ్ .. కీర్తి సురేశ్ జంటగా రూపొందిన ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. తమిళనాట అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక అదే రోజున ఈ సినిమాను తెలుగులోను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

కేరళలోను విజయ్ ను అభిమానించేవారి సంఖ్య ఎక్కువ. అందువలన అక్కడ కూడా చాలా థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న వదిలిన తెలుగు వెర్షన్ టీజర్ కి 11 లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టి తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉందని తెలుస్తోంది. 'సర్కార్' మూవీపట్ల పెరుగుతోన్న ఆసక్తిని బట్టి, ఈ సినిమా విజయ్ కెరియర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయమని చెబుతున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.  

More Telugu News