rajani kanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన విష్ణు విశాల్!

  • రత్ససన్ సినిమా చూసిన రజనీ
  • నటన బాగుందంటూ హీరో విష్ణు విశాల్ కు ప్రశంసలు
  • ట్విట్టర్ లో వివరాలు పంచుకున్న నటుడు

సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా సింపుల్ గా ఉంటారు. ఏదైనా సినిమా తనకు నచ్చితే స్వయంగా నటీనటులకు ఫోన్ చేసి అభినందించడం రజనీ స్టైల్. ఇదే తరహాలో తాజాగా మరో యువ నటుడికి రజనీకాంత్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం రజనీ నటిస్తున్న ‘పేటా’ సినిమా షూటింగ్ వారణాసి షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. దీంతో ఇంటికి చేరుకున్న రజనీకాంత్.. మనవరాళ్లతో కలిసి తమిళ సినిమా ‘రత్ససన్’ను వీక్షించారు.

ఈ సినిమాలో హీరో, యువ నటుడు విష్ణు విశాల్ నటన రజనీకి తెగ నచ్చేసిందట. దీంతో వెంటనే విష్ణు విశాల్ కు ఫోన్ చేసిన రజనీ.. సినిమాలో మీ నటన అద్భుతంగా ఉందని కితాబిచ్చారట. దీంతో ఆనందంతో ఈ యువహీరో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా ట్విట్టర్ లో పంచుకున్నాడు. ‘సినిమాతో పాటు నీ నటన బాగుంది. పోలీస్ డ్రెస్ లో ఫిట్ గా ఉన్నావ్, చక్కగా నటించావు’ అని రజనీ తనకు కితాబిచ్చినట్లు విశాల్ చెప్పారు.

More Telugu News