India: విశాఖ ఇండియా-వెస్టిండీస్ వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్!

  • తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
  • వరుసగా రెండో విజయంపై కోహ్లీ సేన కన్ను
  • భారీగా స్టేడియానికి చేరుకుంటున్న అభిమానులు

భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే కోసం వైజాగ్ లోని వైఎస్సార్ స్టేడియం సిద్ధమయింది. ఈ రోజు టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ను ఎంపిక చేసుకుంది. మరికొన్ని నిమిషాల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకూ భారత జట్టుతో మూడుసార్లు పోటీపడ్డ విండీస్ జట్టు ఓసారి మాత్రం విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది.

మరోవైపు నగర కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా ఆధ్వర్యంలో పోలీసులు స్టేడియంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా మ్యాచ్‌ నిర్వహణకు అవసరమైన పూర్తి స్థాయి చర్యలు చేపట్టారు. మొత్తం 1,400 మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. గువాహటిలో జరిగిన తొలివన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత జట్టు 42 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ నేపథ్యంలో నేడు మ్యాచ్ ను వీక్షించేందుకు వైజాగ్ స్టేడియంకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.

భారత జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, ధోని, అంబటి రాయుడు, ధోని, రిషబ్ పంత్, జడేజా, షమీ, కుల్దీప్, చాహల్, ఉమేశ్ యాదవ్.

విండీస్ జట్టు: పావెల్, హేమ్ రాజ్, హోప్, హెట్మేయర్, శ్యామ్యూల్స్, ఆర్.పావెల్, హోల్డర్, నుర్స్, బిషూ, రోచ్, మెకాయ్.

More Telugu News