India: భారతీయులను పెళ్లి చేసుకునే విదేశీయులకు గుడ్‌న్యూస్!

  • భారతీయుల విదేశీ భాగస్వాములు ఓసీఐ కార్డు పొందేందుకు అర్హులు
  • పలు రంగాల్లో ఎన్నారైలకు సమానమైన సేవలు పొందే అవకాశం
  • పౌరసత్వ పునరుద్ధరణ మరింత సులభతరం చేసిన కేంద్రం

భారతీయ పౌరసత్వం కలిగివున్న వారిని వివాహమాడనున్న విదేశీయులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. భారతీయులను పెళ్లి చేసుకున్న విదేశీ భాగస్వాములు ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డును పొందేందుకు అనుమతినిచ్చింది. అర్హత కలిగిన వ్యక్తులు ఓసీఐ కోసం దరఖాస్తు చేసుకోవచ్చంటూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

గతంలో భారతీయుల జీవిత భాగస్వాములు ఓసీఐ కార్డు పొందేందుకు అర్హులు కాదు. ఇకపై వారు ఓసీఐ కార్డు పొందేందుకు మార్గం సుగుమమైంది. ఓసీఐ కార్డు పొందిన వ్యక్తులు జీవితాంతం భారత్‌లోకి స్వేచ్చగా ప్రయాణించవచ్చు. జీవిత కాల వీసాగా ఓసీఐ కార్డు వారికి ఉపయోగపడుతుంది. ఆర్థిక, విద్యా రంగాల్లో ఎన్నారైలు పొందుతున్న సేవలను ఓసీఐ కార్డుదారులు పొందవచ్చు. కానీ వ్యవసాయం, ఆస్తుల సంపాదనలో కొన్ని నిబంధనలను పాటించాల్సి వుంటుంది.

అంతేకాకుండా భారతీయ పౌరసత్వ పునరుద్ధరణను కేంద్రం మరింత సులభతరం చేసింది. విదేశీ పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులకు ఉపశమనం కలిగించేలా మార్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం మార్గదర్శకాలను వెల్లడించింది.

More Telugu News