India: రైలు ప్రయాణికులకు బంపర్ శుభవార్త... ఇకపై సాధారణ టికెట్లు కూడా ఆన్ లైన్లో!

  • గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు
  • అన్ రిజర్వుడ్ టికెట్లు కూడా ఆన్ లైన్ లోనే
  • నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి

రైలు ప్రయాణికులకు ఇది నిజంగా ఓ శుభవార్తే. గంటల కొద్దీ క్యూలైన్లలో టికెట్ల కోసం నిలబడాల్సిన అవసరం ఇకపై ఏ మాత్రం ఉండబోదని, రిజర్వేషన్ అవసరం లేకుండా, జనరల్ బోగీల్లో ప్రయాణించేందుకు అవసరమైన టికెట్లను ఆన్ లైన్ మాధ్యమంగా కొనుగోలు చేయవచ్చని రైల్వే శాఖ వెల్లడించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 'అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్ సిస్టమ్' (యూటీఎస్‌) సేవలను దేశవ్యాప్తం చేశామని పేర్కొంది.

 కొంతకాలం క్రితం యాప్ రూపంలో ప్రారంభమైన యూటీఎస్, ప్రస్తుతం 15 రైల్వేజోన్లలోనే అందుబాటులో ఉండగా, నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా, అన్ని రైల్వే టికెట్లనూ ఆన్‌ లైన్‌ లో అందుబాటులో ఉంచనున్నామని రైల్వే శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. ఈ యాప్ ను విస్తృతంగా వాడుకునేందుకు ప్రత్యేక ప్రచారం చేయనున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News