shruti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బుల్లితెరపై శ్రుతి హాసన్ నిర్వహించే షో 
  • 'పందెం కోడి' దర్శకుడు రూపొందించే బయోపిక్
  • వెంకటేశ్, చైతు సినిమా అప్ డేట్!  

*  అందాల కథానాయిక శ్రుతి హాసన్ తొలిసారిగా ఓ టీవీ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. 'హలో సాగో' పేరిట రూపొందే ఈ తమిళ కార్యక్రమం సన్ టీవీలో ఈ నెల 28 నుంచి ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా పలువురు చిత్ర ప్రముఖులను ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది.
*  తాజాగా 'పందెం కోడి 2' చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు లింగుస్వామి త్వరలో ఓ బయోపిక్ ను రూపొందించనున్నాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితకథను ఆయన తెరకెక్కించనున్నట్టు సమాచారం.
*  వెంకటేశ్, నాగచైతన్య కలసి ఓ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగును వచ్చే నెల రెండో వారం నుంచి నిర్వహించనున్నారు. దీనికి 'వెంకీ మామ' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. 

More Telugu News