sitaram yechuri: అందుకే, ఆస్థానాను నియమించారు: సీతారాం ఏచూరి విమర్శలు

  • మోదీ హయాంలో అర్హత లేని వారికి ఉన్నత స్థానాలు
  • లంచాల కేసులో మోదీ వ్యక్తి ఆస్థానా దొరికిపోయాడు
  • ఆస్థానాకు ఎవరు అండగా నిలుస్తున్నారు?

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో అర్హత లేని అధికారులను ఎందరినో ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారని, అందుకు తాజా నిదర్శనం సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాయేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈ మేరకు ఏచూరి వరుస ట్వీట్లు చేశారు. ఆస్థానాను ఉన్నత స్థానంలో నియమించడం ద్వారా బీజేపీ నేతలపై ఉన్న కేసుల విచారణను జరగకుండా ఆపించాలన్నదే ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు.

 లంచాలు తీసుకుని నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో మోదీ వ్యక్తి అయిన ఆస్థానా ఇప్పుడు దొరికిపోయాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు, ఆస్థానాకు ఎవరు అండగా నిలుస్తున్నారు? సీబీఐ డైరెక్టర్ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆస్థానాను ఎవరు ఎంపిక చేశారు? అని ప్రశ్నించారు. లంచాల కేసులో విచారణ నిమిత్తం ఆస్థానాను కష్టమైన ప్రశ్నలు కూడా వేయడం లేదని, ఇందులో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

More Telugu News