cbi: సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ ఆస్థానాను అరెస్ట్ చేయొద్దన్న ఢిల్లీ హైకోర్టు

  • లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్థానా
  • తనపై ఎటువంటి చర్యలొద్దంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
  • మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం

లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారణకు తీసుకున్న హైకోర్టు ధర్మాసనం, ఆస్థానాను అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యథాతథ స్థితిని కొనసాగించాలని ఈ మేరకు సీబీఐను ఆదేశించింది. ఈ నెల 29కి విచారణను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.

కాగా, ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని, తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆ పిటిషన్ లో దేవేందర్ కుమార్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ఇంకా విచారణకు రావాల్సి ఉంది.

More Telugu News