dhanush: 'వడ చెన్నై'లో ఫస్టు నైట్ సీన్ ను తొలగిస్తాం: దర్శకుడు వెట్రిమారన్

  • ధనుశ్ హీరోగా వచ్చిన 'వడ చెన్నై'
  • మత్స్యకారుల చుట్టూ తిరిగే కథ 
  • కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు

ధనుశ్ తాజా చిత్రంగా ఇటీవలే 'వడ చెన్నై' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి వెట్రి మారన్ దర్శకుడిగా వ్యవహరించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. చెన్నై నగరంలోని ఉత్తరప్రాంతంలో మత్స్య కారులు ఎక్కువగా వుంటారు .. వాళ్ల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రాంతంలోని మత్స్యకారులు తమను .. తమ జీవన విధానాన్ని ఈ సినిమాలో నెగెటివ్ గా చూపించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే బోట్ లో జరిగే ఫస్టు నైట్ సన్నివేశం అభ్యంతరకరంగా ఉందనీ .. దానిని వెంటనే తొలగించాలని ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై దర్శకుడు వెట్రి మారన్ స్పందిస్తూ .. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకి లేదని చెప్పారు. అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న కారణంగా, వారం రోజుల్లో ఫస్టు నైట్ సీన్ ను తొలగిస్తామని అన్నారు.   

More Telugu News