sensex: వరుసగా నాలుగో రోజు నష్టపోయిన మార్కెట్లు

  • మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు నష్టాలు
  • అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న ఐటీ, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు
  • 287 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 34 వేల కంటే దిగువకు పడిపోయింది. ఐటీ, హెల్త్ కేర్, ఆయిల్ మరియు గ్యాస్ సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 287 పాయింట్లు నష్టపోయి 33,847కు పడిపోయింది. నిఫ్టీ 98 పాయింట్లు కోల్పోయి 10,146కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
లక్ష్మీ విలాస్ బ్యాంక్ (8.15%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (4.81%), జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్ (4.72%), సుజ్లాన్ ఎనర్జీ (4.43%), కేర్ రేటింగ్స్ (4.19%).  

టాప్ లూజర్స్:
కన్సాయ్ నెరొలాక్ పెయింట్ (-7.30%), బయోకాన్ (-6.92%), ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ (-6.44%), 3ఎం ఇండియా (-6.28%), దిలీప్ బిల్డ్ కాన్ (-6.10%). 

More Telugu News