Pawan Kalyan: ఫ్లాప్ అయిన పవన్ 'అజ్ఞాతవాసి'... ఇప్పుడో ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది!

  • హిందీలోకి డబ్ అయిన చిత్రం
  • ఆన్ లైన్ లో రెండు రోజుల్లో రెండు కోట్ల వ్యూస్
  • ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది చిత్రం

పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' సినీ ప్రేక్షకులకు మెప్పించడంలో విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. బయ్యర్లకు నష్టాలను మిగిల్చిన ఈ సినిమా, ఆన్ లైన్ లో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి 'ఎవడు-3' పేరిట ఆన్ లైన్ లో విడుదల చేయగా, రెండు రోజుల్లో 2 కోట్ల మంది సినిమాను చూశారు. ఓ దక్షిణాది చిత్రం హిందీలోకి డబ్ అయి, 48 గంటల్లోనే ఇన్ని వ్యూస్ రావడం ఇదే తొలిసారి. ఆ విధంగా పవన్ 'అజ్ఞాతవాసి' ఓ అరుదైన రికార్డును సృష్టించింది. ఇక ఈ డబ్బింగ్ వర్షన్ మరెన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.

More Telugu News