Daggubati: 'ఎన్టీఆర్' నుంచి 'దగ్గుబాటి' లుక్ వచ్చేసింది!

  • దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా నటిస్తున్న భరత్ రెడ్డి
  • నేడు భరత్ రెడ్డి పుట్టిన రోజు
  • ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన యూనిట్

దివంగత నేత ఎన్టీఆర్ జీవిత కథతో, బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న రెండు భాగాల చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి నటిస్తున్నాడు. ఈ చిత్రంలో భరత్ రెడ్డి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ వెనక నిలబడి ఉన్న దగ్గుబాటిగా భరత్ రెడ్డి అలరిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, దగ్గుబాటి మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు క్రిష్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

నేడు భరత్ రెడ్డి పుట్టినరోజు కాగా, ఈ సందర్భంగా ఈ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో పలు ముఖ్య పాత్రలను టాలీవుడ్ ప్రముఖ నటీనటులు పోషిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి, వచ్చే సంవత్సరం సంక్రాంతికి ముందు ఓ భాగం, తరువాత మరో భాగాన్ని విడుదల చేసే యోచనలో ఉన్నాడు క్రిష్.

More Telugu News