Revanth Reddy: ఐటీ అధికారుల విచారణ నిమిత్తం కదిలిన రేవంత్ రెడ్డి!

  • ఉదయం 11 గంటల నుంచి విచారణ
  • ఐటీ కార్యాలయానికి బయలుదేరిన రేవంత్
  • పద్మనాభరెడ్డి, ఉదయసింహ కూడా

ఆదాయానికి మించిన ఆస్తులు, డొల్ల కంపెనీల లావాదేవీలపై ఐటీ అధికారులు, కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని నేడు మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే అధికారుల నోటీసులు అందుకున్న రేవంత్ రెడ్డి, అధికారుల విచారణకు హాజరయ్యే నిమిత్తం బయలుదేరారు. కాసేపట్లో ఆయన విచారణను ఎదుర్కోనున్నారు. ఈ కేసులో ఆయన్ను ఇప్పటికే రెండు సార్లు విచారించారన్న సంగతి విదితమే.

నేడు రేవంత్ రెడ్డితో పాటు పద్మనాభ రెడ్డి, ఉదయసింహ, శ్రీసాయి మౌర్యా సంస్థ డైరెక్టర్లు, ఆడిటర్లు, కేఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ సంస్థ ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కానున్నారు. నేటి ఉదయం 11 గంటల నుంచి విచారణ ప్రారంభమవుతుందని ఐటీ వర్గాలు అంటున్నాయి. నేటి విచారణలో రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల పేర్లపై ఉన్న కంపెనీలు, వాటి లావాదేవీల గురించిన వివరాలను అధికారులు అడిగి, తెలుసుకోనున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News