Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి కాదు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు

  • అలాగని మరొకరిని కూడా ప్రకటించబోం
  • ప్రాంతీయ పార్టీల వల్ల కాంగ్రెస్, బీజేపీ ఓట్లపై ప్రభావం
  •  ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించుతాం

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ప్రకటించబోమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగని మరొకరిని కూడా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని పేర్కొన్న చిదంబరం గత రెండు దశాబ్దాల్లో ప్రాంతీయ పార్టీలు బాగా పెరిగాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఓట్ల శాతంపై అవి తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్.. భావసారూప్య పార్టీలతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబోమంటూ చిదంబరం చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

More Telugu News