Driving Lisence: ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ లపై నమ్మలేని నిజాలు!

  • ప్రమాదాల్లో 80 శాతం లైసెన్స్ ఉన్న వారు చేస్తున్నవే
  • లైసెన్స్ లు ఉన్నవారిలో 88 శాతం మందికి నిబంధనలు తెలియవు
  • సేవ్ లైఫ్ ఫౌండేషన్ అధ్యయనంలో వెల్లడి

డ్రైవింగ్ లైసెన్స్ లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారు, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారే ప్రమాదాలు చేస్తుంటారని భావించే వాదన అసత్యమని తేలింది. దేశవ్యాప్తంగా సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఓ అధ్యయనం నిర్ణయించగా, పలు కీలకాంశాలు వెల్లడయ్యాయి. గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం ప్రమాదాలకు డ్రైవింగ్ లైసెన్స్ లు ఉన్నవారే కారణం. డ్రైవింగ్ లైసెన్స్ లు ఉన్న వారిలో 59 శాతం మంది ఎలాంటి పరీక్షలకు హాజరు కాకుండానే లైసెన్స్ లు పొందుతున్నారని కూడా అధ్యయనం తేల్చింది.

ఇక 25 శాతం మందికి ఒకటి కన్నా ఎక్కువ లైసెన్స్ లు ఉండగా, లైసెన్స్ లను పొందిన వారిలో రోడ్డు నిబంధనలు తెలిసిన వారు కనీసం 12 శాతం మంది కూడా లేరు. లెర్నర్ లైసెన్స్ లేదా టెస్టుకు హాజరు కాకుండా రూ. 4 వేల వరకూ చెల్లించి లైసెన్స్ లు పొందుతున్నవారే అధికమని సేవ్ లైఫ్ ఫౌండేషన్ సీఈఓ పీయూష్ తివారీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన లైసెన్స్ విధానంతో పాటు, ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.

More Telugu News