Sabarimala: కేరళ ప్రభుత్వం మహా ప్లాన్.. పురుషుల వేషధారణలో ఆలయంలోకి మహిళలు?

  • రాత్రివేళ ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధమైందన్న వార్తలు
  • అందుకే మీడియాను పంపించేశారన్న భక్తులు 
  • ప్రభుత్వం తీరుపై అనుమానాలు

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మహిళలను ఎలాగైనా శబరిమల ఆలయంలోకి తీసుకెళ్లాలని కేరళ ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పును నిరసిస్తూ వేలాదిమంది భక్తులు శబరిమల వస్తున్న మహిళలను అడ్డుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం సరికొత్త పథక రచన చేసినట్టు భక్తులు చెబుతున్నారు. మహిళా భక్తులను పురుషుల వేషధారణలో ఎవరికీ అనుమానం రాకుండా ఆలయంలోకి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ప్లాన్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

శబరిమలలో ఉన్న భక్తులను, మీడియా ప్రతినిధులను ఖాళీ చేయాల్సిందిగా సోమవారం ఆదేశించిన ప్రభుత్వం రాత్రివేళ ఈ ఆపరేషన్ చేపట్టాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జామర్లను ఏర్పాటు చేస్తోందని అనుమానిస్తున్నారు.

ఈనెల 18న అయ్యప్ప ఆలయాన్ని తెరిచి సోమవారం మూసివేశారు. చివరి రోజున స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరిన దళిత కార్యకర్త బిందును పంబ వరకు రాకుండానే బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాగా, శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్లను ఎప్పుడు విచారించేదీ సుప్రీంకోర్టు నేడు నిర్ణయించనుంది.

More Telugu News