Chandrababu: ‘తిత్లీ’ బాధితులను ఆదుకోవాలంటూ చంద్రబాబు బహిరంగ లేఖ

  • రెండు లేఖలు రాసినా.. కేంద్రం నుంచి స్పందన లేదు
  • వీలైనంత విరాళం ఇచ్చి బాధితులను ఆదుకోవాలి
  • సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నాం

తిత్లీ తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని వివరిస్తూ నిధులు కోరినా.. ఇంత వరకూ కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవాలని కోరుతూ చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తుపాను కారణంగా రూ.3435 కోట్ల నష్టం వాటిల్లిందని.. తక్షణ సాయం కింద రూ.1200 కోట్ల ఆర్థిక సాయం అందించాలని గతంలో కేంద్రానికి ఓ లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు.

అలాగే జరిగిన నష్టాన్ని వివరిస్తూ మరో లేఖ రాసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వీలైనంత విరాళం ఇచ్చి తిత్లీ బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పరిహారం ప్రకటించినట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం నిధుల కోసం తాము ఎదురు చూడకుండా సహాయక చర్యల్ని ముమ్మరంగా చేస్తున్నామని చంద్రబాబు లేఖలో వెల్లడించారు.

More Telugu News