Arun Jaitly: చోక్సీ నుంచి రూ. 24 లక్షలు అందుకున్న జైట్లీ కుమార్తె.. నిలదీసిన కాంగ్రెస్!

  • డబ్బులు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించిన సచిన్ పైలట్
  • ఈ వార్తలను మీడియా ప్రచురించకపోవడం దారుణమన్న రాహుల్
  • కలకలం రేపుతున్న ఆరోపణలు

బ్యాంకులకు వేల కోట్లను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మేహుల్ చోక్సీ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె సొనాలీకి రూ. 24 లక్షలు అందాయనే వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ నిలదీశారు. 2017 డిసెంబర్ లో చోక్సీకి చెందిన కంపెనీ గీతాంజలి జెమ్స్ నుంచి ఛాంబర్స్ ఆఫ్ జైట్లీ అండ్ అసోసియేట్స్ ఖాతాకు డబ్బు జమ అయింది. ఈ సంస్థ జైట్లీ కుమార్తె సొనాలీ, అల్లుడు జయేష్ లకు చెందింది.

ఈ క్రమంలో, ఎలాంటి సేవలు అందించని ఈ కంపెనీకి నిధులు ఎందుకిచ్చారని పైలట్ ప్రశ్నించారు. సొమ్ము తీసుకున్న రెండు నెలలకు ఆ డబ్బును తిరిగి గీతాంజలి కంపెనీ ఖాతాలో వేశారు. ఈ అంశంపై వివాదం నెలకొనడంతో డబ్బును వెనక్కి తిరిగిచ్చేశారని... అసలు డబ్బును ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇదే విషయంపై రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. ఇలాంటి వాస్తవాలను మీడియా ప్రచురించకపోవడం దారుణమని అన్నారు.

More Telugu News