Rahul Gandhi: అంతా మోదీ పుణ్యమే.. సీబీఐలో కూడా కుమ్ములాటలు మొదలయ్యాయి: రాహుల్

  • మోదీ సన్నిహితుడు రాకేష్ ఆస్థానా లంచం కేసులో ఇరుక్కున్నారు
  • సీబీఐ పరువును మోదీ తీసేశారు
  • సీబీఐని మోదీ ఒక అస్త్రంలా వాడుకుంటున్నారు

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శల దాడిని పెంచారు. మోదీని విమర్శించేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా రాహుల్ వదలడం లేదు. తాజాగా రాహుల్ మాట్లాడుతూ, ఎంతో ఉన్నతమైన సీబీఐ కూడా క్షీణ దశకు చేరుకుందని అన్నారు. సీబీఐ అధికారులు వారిలో వారే కొట్టుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై స్వయంగా సీబీఐ కేసు నమోదు చేసిన అశంపై స్పందిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ కక్ష సాధింపుల కోసం సీబీఐని మోదీ ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని అన్నారు. గుజరాత్ కేడర్ అధికారి, గోద్రా సిట్ ఫేమ్, మోదీకి సన్నిహితుడు, సీబీఐలో నెంబర్ టూ అధికారిగా చొరబడిన వ్యక్తి అయిన ఆస్థానా ఇప్పుడు లంచం కేసులో పట్టుబడ్డారని ఎద్దేవా చేశారు. మోదీ సీబీఐ పరువు తీశారని మండిపడ్డారు. ఆస్థానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్ గా నియమించడంపై కాంగ్రెస్ కొన్ని రోజుల నుంచి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News