Kerala: కేరళ నన్ అత్యాచారం కేసులో మరో ట్విస్ట్.. ప్రధాన సాక్షి అనుమానాస్పద మృతి!

  • క్రైస్తవ సన్యాసినిపై రెండేళ్లు అత్యాచారం
  • కేసు నమోదుచేసి అరెస్ట్ చేసిన పోలీసులు
  • విడుదలైన వారంలోనే ప్రధాన సాక్షి దుర్మరణం

కేరళలో క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం జరిగిన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ద్వాసా చర్చి ఫాదర్ కురియకోస్ కథుథార పంజాబ్ లోని జలంధర్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ కేసులో నిందితుడు ఫ్రాంకో బిషప్ ములక్కల్ బెయిల్ పై విడుదలైన కొన్ని రోజులకే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఈ కేసు నుంచి తప్పుకోకుంటే చంపేస్తామని ఫాదర్ కురియకోస్ ను కొందరు దుండగులు బెదిరించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

అయినా వెనక్కు తగ్గకపోవడంతో కిరాతకంగా హత్యచేశారని ఆరోపించారు. దుండగులకు శిక్ష పడేవరకూ న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తనపై బిషప్‌ ములక్కల్‌ 2014 నుంచి 2016 వరకూ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆయన్ను సెప్టెంబర్ 21న అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. కాగా, ఈ నెల 15న ములక్కల్ కు షరతులతో కూడిన బెయిల్ ను కేరళ హైకోర్టు మంజూరు చేసింది.

More Telugu News