Balakrishna: బాలయ్య చేతుల మీదుగా మెమెంటో అందుకున్న ఎన్టీఆర్.. ఆప్యాయంగా హత్తుకున్న బాబాయ్!

  • 'అరవింద సమేత' సక్సెస్ మీట్ లో ఆవిష్కృతమైన సన్నివేశం
  • కేరింతలు కొట్టిన అభిమానులు 
  • ఆడిటోరియంలో హర్షాతిరేకాలు

హైదరాబాదులోని శిల్ప కళావేదికలో జరుగుతున్న 'అరవింద సమేత' సక్సెస్ మీట్ లో నందమూరి అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సన్నివేశం ఆవిష్కృతమైంది. చిత్రంలో నటించిన నటీనటులకు ముఖ్య అతిథిగా హాజరైన బాలయ్య మెమెంటోలను అందించారు. ఈ సందర్భంగా తారక్ కు కూడా బాలయ్య మెమెంటో అందించారు. ఈ సందర్భంగా, తారక్ ను బాలయ్య ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ సన్నివేశాన్ని వీక్షించిన అభిమానులు కేరింతలు కొట్టారు. ఆడిటోరియంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 

More Telugu News