kcr: కేసీఆర్ విజన్ లేని ముఖ్యమంత్రి.. అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది: రాంమాధవ్

  • తెలంగాణకు లక్షా 15 వేల కోట్లను ఇస్తే.. లెక్కలు కూడా చెప్పడం లేదు
  • రాష్ట్రంలోని రోడ్లు గుంతలమయం అయ్యాయి
  • తెలంగాణలో మార్పు రావాలంటే.. ప్రభుత్వం మారాలి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను విజన్ లేని ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. అవినీతిలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ. లక్షా 15 వేల కోట్లను ఇచ్చిందని... వాటికి తెలంగాణ ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని విమర్శించారు. తెలంగాణలోని రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని అన్నారు. టీఆర్ఎస్ తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. తెలంగాణలో మార్పు రావాలంటే.. ప్రభుత్వం మారాలని అన్నారు. అవినీతి పరులను పట్టుకుంటే... టీడీపీ నేతలు కక్ష సాధింపు అంటున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తెలదని రాంమాధవ్ దుయ్యబట్టారు. సాక్షాత్తు హోంమంత్రి నాయినికి కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకడం లేదని... ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి వల్లే అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ది నాలుగేళ్ల దుష్ట పరిపాలన అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి జీవం పోసే ప్రయత్నాన్ని టీడీపీ చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ కు డబ్బు సంచులు పంపుతోందని చెప్పారు. 

More Telugu News