anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ముందు భాష నేర్చుకుంటానంటున్న అనుపమ 
  • కమల్ కోసం అమెరికానుంచి ఫిట్ నెస్ ట్రైనర్ 
  • రెజ్లింగ్ నేపథ్యంలో షకలక శంకర్ సినిమా

*  'ఏ భాషలో సినిమా చేసినా షూటింగుకి ముందే కొద్దిగా ఆ భాషను నేర్చుకుంటాను..' అంటోంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. 'తెలుగులో మొదటిగా అవకాశం వచ్చినప్పుడు తెలుగు కాస్త  నేర్చుకున్నాను. అలాగే తమిళం చేసేటప్పుడు తమిళ్ నేర్చుకున్నాను. అందుకే ఆయా భాషల్లో డబ్బింగ్ కూడా చెబుతున్నాను' అని చెప్పింది.
*  1996లో వచ్చిన 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ కలసి 'భారతీయుడు 2' చేస్తున్నారు. డిసెంబర్ లో ఈ చిత్రం తొలి షెడ్యూల్ జరుగుతుంది. కాగా, ఈ చిత్రం కోసం కమల్ అమెరికాకు చెందిన ఫిట్ నెస్ ట్రైనర్ ను తీసుకువస్తున్నాడట.  
*  'జబర్దస్త్' ఫేం షకలక శంకర్ ఆమధ్య 'శంబో శంకర' చిత్రంతో హీరోగా మారిన సంగతి విదితమే. ఆ చిత్రం తర్వాత మరికొన్ని చిత్రాలలో హీరోగా నటించే అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా 'శంకర్ పహిల్వాన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఏఏ ధనుశ్ దర్శకత్వం వహించే ఈ చిత్రం రెజ్లింగ్ ఆధారంగా సాగుతుందట.  

More Telugu News