revanth reddy: కాంగ్రెస్ ది కుటుంబ పాలన అని సోయి లేని ముఖ్యమంత్రి అంటున్నారు: రేవంత్ రెడ్డి ఫైర్

  • గాంధీల చరిత్ర కేసీఆర్ చదివినట్టు లేరు
  • పదవి కావాలని సోనియా ఏనాడు కోరుకోలేదు
  • రాహుల్ ను ప్రధాని చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది

ఆదిలాబాద్ జిల్లాలో మీ ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందనే నమ్మకం కలిగిందని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారు. 2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 8 చోట్ల కాంగ్రెస్ గెలుపొందిందని చెప్పారు. తెలుగు బిడ్డలను రాష్ట్రపతిగా, ప్రధాన మంత్రిగా చేసిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన అని సోయిలేని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు. 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకుంటున్న కేసీఆర్... గాంధీల కుటుంబ చరిత్ర చదివినట్టు లేరని అన్నారు. నెహ్రూ బతికి ఉన్నంత కాలం ఇందిరాగాంధీ మంత్రి కాలేదని... ఇందిరాగాంధీ ఉన్నంత కాలం రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రాలేదని... రాజీవ్ గాంధీ ఉన్నంత కాలం సోనియాగాంధీ రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడలేదని చెప్పారు. రెండుసార్లు మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేశారే తప్ప... పదవి కావాలని సోనియా ఏనాడు కోరుకోలేదని తెలిపారు. రాహుల్ గాంధీకి అండగా ఉండి, ఆయనను ప్రధానిని చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలకు ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. 

More Telugu News