charan: చరణ్ ఫస్టులుక్ ను వదలకపోవడానికి కారణమదేనట!

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • టైటిల్ లోగోపై కసరత్తు
  • త్వరలోనే ఫస్టులుక్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు 3 నెలలు అవుతోంది. అయినా ఇంతవరకూ చరణ్ ఫస్టులుక్ ను వదల్లేదు. దాంతో మెగా అభిమానులు నిరాశకి గురవుతున్నారు. ఇంతవరకూ బోయపాటి ఈ సినిమా ఫస్టులుక్ ను వదలకపోవడానికి కారణం ఏమిటనే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ లోగోను ఖరారు చేయకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది.

ఈ సినిమాకి ఇటీవలే 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ను ఎంపిక చేశారు. అయితే, ఈ  టైటిల్ లోగోను దర్శక నిర్మాతలు, చరణ్ ఖరారు చేయవలసి వుంది. రకరకాలుగా టైటిల్ లోగోను డిజైన్ చేయిస్తున్నారు. ఇంతవరకూ ఏ డిజైన్ కూడా సంతృప్తికరంగా అనిపించకపోవడం వల్లనే ఫస్టులుక్ బయటికి రాలేదని చెబుతున్నారు. టైటిల్ లోగో ఓకే అయిన వెంటనే ఫస్టులుక్ ను వదిలేస్తారట. బహుశా దీపావళికి రావొచ్చని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని నటిస్తోన్న సంగతి తెలిసిందే.     

More Telugu News