vijay: దుమ్మురేపేస్తోన్న 'సర్కార్' టీజర్ .. రికార్డు స్థాయిలో లైక్స్

  • స్టైలిష్ లుక్ తో అదరగొట్టేసిన విజయ్ 
  • యూట్యూబ్ లో దూసుకుపోతోన్న టీజర్ 
  • దీపావళికి విడుదల  

మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 'సర్కార్' చిత్రం నిర్మితమైంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ టీజర్లో విజయ్ చాలా స్టైలీష్ గా కనిపించాడు.లుక్ పరంగా ఆయనకి మంచి మార్కులు పడిపోయినట్టే. ఆయన మేనరిజం అభిమానులతో విజిల్స్ వేయించేలా వుంది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, భారీతనానికి ప్రతీకగా కనిపిస్తోంది. యూట్యూబ్ లో ఈ టీజర్ ను రిలీజ్ చేసిన 12 గంటల్లోనే 11 మిలియన్ల వ్యూస్ లభించాయి. ఇక 5 గంటల్లోనే వన్ మిలియన్ లైక్స్ వచ్చాయి .. ఇది ఒక రికార్డు అనేది కోలీవుడ్ టాక్. విజయ్ కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టేననేది ఆయన అభిమానుల మాట.

More Telugu News