ntr: భారీ స్థాయిలో 'అరవింద' విజయోత్సవ సభ

  • దసరా కానుకగా వచ్చిన 'అరవింద'
  • అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ
  • శిల్పకళా వేదికలో విజయోత్సవ వేడుక     

దసరా కానుకగా ఈ నెల 11వ తేదీన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా విడుదలైంది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో, ఈ సినిమాకి కాసుల వర్షం కురుస్తోంది. కథాకథనాలు .. మాటలు .. పాటలు .. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి నూటికి నూరు మార్కులు దక్కించుకున్నాయి. త్రివిక్రమ్ తన మార్క్ నుంచి పక్కకి వచ్చి కొత్త కోణంలో ఆవిష్కరించడం వలన ఈ సినిమా ఎదురులేకుండా దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా విజయోత్సవ సభను నిర్వహించాలని టీమ్ భావించింది. హైదరాబాద్ - శిల్పకళా వేదికలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు .. సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవనున్నట్టు తెలుస్తోంది.     

More Telugu News