Balakrishna: 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం జయప్రదగా రంగంలోకి దిగిన తమన్నా

  • అక్కినేనిగా సుమంత్ 
  • శ్రీదేవిగా రకుల్ 
  • తమన్నాకు ఒక పాట కూడా  

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మొదటిభాగమైన 'కథానాయకుడు'కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వెళుతున్నారు. ఈ భాగంలో అక్కినేనిగా సుమంత్ .. శ్రీదేవిగా రకుల్ కనిపించనున్నారు. ఇక జయప్రద పాత్రకోసం ఇటీవలే తమన్నాను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఆమె షూటింగులో జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది.

'అడవిరాముడు' .. 'సూపర్ మేన్' .. 'యమగోల' తదితర చిత్రాలు ఎన్టీఆర్ - జయప్రద కాంబినేషన్లో ఘన విజయాలను సాధించాయి. ఈ సినిమాలకి సంబంధించి ఎన్టీఆర్ బయోపిక్ లో ఒకటి రెండు సన్నివేశాలకు .. ఒక సూపర్ హిట్ సాంగ్ కు చోటుదక్కినట్టు చెబుతున్నారు. జయప్రద పాత్రలో తమన్నా ఎలా ఒదిగిపోనుందో .. ఏ సూపర్ హిట్ సాంగ్ కి స్టెప్స్ వేయనుందో చూడాలి. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.  

More Telugu News