Telangana: తెలంగాణలో స్వైన్ ఫ్లూ టెర్రర్.. ఒక్క నెలలోనే 125 కేసుల నమోదు!

  • జాబితాలో ఐఏఎస్ అధికారులు, ఆర్డీవోలు
  • అధికారుల వివరాలపై గోప్యత పాటిస్తున్న వైద్యులు
  • ఇప్పటివరకూ నలుగురు మృతి

తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న ప్రజల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ ఒక్క తెలంగాణలోనే 125 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఇప్పటిదాకా స్వైన్ ఫ్లూ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేవలం సామాన్యులే కాదు.. సాక్షాత్తూ ఐఏఎస్, ఆర్డీవో స్థాయి అధికారులు ఉండటం గమనార్హం.

తెలంగాణలో ఇప్పటివరకూ ముగ్గురు ఐఏఎస్ అధికారులు, నలుగురు డీఆర్వో, ఆర్డీవో స్థాయి అధికారులు ఉన్నట్లు సమాచారం. అధికారుల పేర్లను బయటపెడితే మళ్లీ విధి నిర్వహణలో ఇబ్బందులు వచ్చే అవకాశమున్నందున గోప్యత పాటిస్తున్నారు.

మరోవైపు ఈ విషయమై గాంధీ ఆసుపత్రి వైద్యుడొకరు స్పందిస్తూ.. గత వారం రోజుల్లో 20 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాది 54 మంది ఈ వ్యాధికి చికిత్స పొందగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. 

More Telugu News