punjab: బాధాకరం.. మాటలు కూడా రావడం లేదు: రాజ్ నాథ్

  • వార్త విని షాక్ అయ్యా.. మాటలు కూడా రావడం లేదు
  • ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోయామన్న రాజ్ నాథ్
  • ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ తెరిచి ఉంచాలంటూ అమరీందర్ సింగ్ ఆదేశం 

అమృత్ సర్ లో రావణ దహన వేడుకలను వీక్షిస్తున్న జనాలపై నుంచి రైలు దూసుకెళ్లడంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వార్త విని షాక్ కు గురయ్యానని చెప్పారు. పండుగ రోజున ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోయామని... దీనిపై స్పందించడానికి కూడా తనకు మాటలు రావడం లేదని తెలిపారు.

ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ వైద్యం అందేంత వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ తెరిచే ఉంచాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన జిల్లా అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. హోమ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, లా అండ్ ఆర్డర్ అసిస్టెంట్ డీజీపీలు వెంటనే అమృత్ సర్ చేరుకోవాలని ఆదేశించారు. రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించేందుకు వెంటనే అమృత్ సర్ వెళ్లాలని రెవెన్యూ మంత్రి సుఖ్ బీందర్ సర్కారియాను ఆదేశించారు. 

More Telugu News