rajnath singh: రాముడికి, రావణుడికి మధ్య తేడా ఇదే: రాజ్ నాథ్ సింగ్

  • రాముడి కంటే రావణుడు ధనవంతుడు, శక్తిమంతుడు
  • వ్యక్తిత్వం కారణంగా రాముడు పూజ్యునీయుడిగా మారారు
  • ఇకపై సరిహద్దుల్లో జవాన్లు 24 గంటలు నిల్చొని పహారా కాయాల్సిన అవసరం లేదు

దసరా పండుగ సందర్భంగా బికనీర్ లో పూజలు నిర్వహించిన అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీఎస్ఎఫ్ అధికారులు, జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ, పండుగ ప్రాముఖ్యతను వివరించారు. రాముడి కంటే రావణుడు ఎంతో ధనవంతుడు, శక్తిమంతుడని ఆయన చెప్పారు. అయితే, వ్యక్తిత్వం కారణంగా రాముడు పూజ్యునీయుడిగా మారారని చెప్పారు. ఇద్దరి మధ్య ఇదే తేడా అని వివరించారు.

ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ, ఇకపై సరిహద్దుల్లోని సైనికులు 24 గంటలు నిల్చొని పహారా కాయాల్సిన అవసరం లేదని చెప్పారు. దానికి బదులుగా సరికొత్త సాంకేతిక మార్గాలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. దీని వల్ల సరిహద్దు భద్రత మరింత పెరుగుతుందని, 24 గంటలు నిల్చునే అవస్థ జవాన్లకు తప్పుతుందని చెప్పారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా సరిహద్దుల్లో జరిగే కార్యకలాపాలను గుర్తించవచ్చని అన్నారు. జమ్ములో ఇప్పటికే దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ప్రారంభించామని వెల్లడించారు. చొరబాటుదారులు చొచ్చుకొస్తున్నారనే విషయం తెలియగానే... బలగాలను అప్రమత్తం చేయవచ్చని చెప్పారు. పొరుగు దేశం ఆయుధాలను వాడటం ఆపేస్తే... వాటిని మనం కూడా వాడాల్సిన అవసరం లేదని అన్నారు. 

More Telugu News