లైంగిక ఆరోపణలు.. జననేంద్రియాన్ని కత్తిరించుకున్న సాధువు!

19-10-2018 Fri 17:00
  • జననేంద్రియాన్ని కత్తిరించుకున్న 29 ఏళ్ల బాబా
  • స్థానికంగా ఉన్న ఓ మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ ఆరోపణలు
  • తీవ్ర మనోవేదనకు గురైన బాబా

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలతో తీవ్ర మనోవేదనకు గురైన సాధువు తన జననేంద్రియాన్ని కత్తిరించుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. జననేంద్రియాన్ని కత్తిరించుకున్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన మదానీ బాబా... లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బామ్నా జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ సాధువు వయసు 29 సంవత్సరాలు. కాంసిన్ గ్రామంలో ఉంటున్నారు.

స్థానికంగా ఉన్న ఓ మహిళతో మదానీ బాబాకు అక్రమ సంబంధం ఉందంటూ కొంత మంది వ్యక్తులు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆయనకు ట్రీట్ మెంట్ కొనసాగుతోందని డాక్టర్ బల్వీర్ సింగ్ తెలిపారు. మరోవైపు, ఓ ఖాళీ స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించేందుకు బాబా యత్నిస్తున్న నేపథ్యంలోనే... గిట్టనివారు కొందరు ఆయనపై ఆరోపణలు చేశారని కొందరు అంటున్నారు.