hyderabad: శంషాబాద్ లో అమ్మవారి విగ్రహం పాలు తాగుతోందంటూ ప్రచారం

  • శంషాబాద్ కోట మైసమ్మ ఆలయంలో పాలు తాగుతున్న అమ్మవారు
  • ఇది అమ్మవారి మహాత్మ్యమని నమ్ముతున్న భక్తులు
  • ఆలయానికి తండోపతండాలుగా చేరుకుంటున్న భక్తులు

హైదరాబాద్ శివారు శంషాబాద్ లోని కోట మైసమ్మ ఆలయంలో అమ్మవారు పాలు తాగుతున్నారనే ప్రచారంతో గుడికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి మహాత్మ్యం చూసేందుకు తండోపతండాలుగా ఆలయానికి తరలి వచ్చారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అమ్మవారికి పాలు తాగించేందుకు పోటీలు పడ్డారు. అమ్మవారికి స్పూనుతో పెట్టిన పాలు మాయమవుతుండటంతో... ఇది అమ్మవారి మహాత్మ్యమేనని భక్తులు చెబుతున్నారు. అమ్మవారికి ప్రత్యేక శక్తులు ఉన్నాయని అంటున్నారు. గతంలో కూడా ఆయలం వద్ద గజ్జల శబ్దాలు వచ్చేవని చెబుతున్నారు.  

మరోవైపు, అమ్మవారు పాలు తాగుతున్నారనే ప్రచారంతో... ఈ పరిసర ప్రాంతాల్లో పాల ప్యాకెట్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ సందర్భంగా ఓ భక్తుడు మాట్లాడుతూ, ఉదయం అమ్మవారికి హోమం చేశామని తెలిపారు. విగ్రహాలు పాలు తాగుతాయని గతంలో విన్నామని... అమ్మవారికి కూడా పాలు తాగించాలని ఆవు పాలను తెప్పించి, స్పూన్ తో తాగించామని చెప్పారు. ఆశ్చర్యకరంగా అమ్మవారు పాలను తాగారని తెలిపారు. 

More Telugu News