railway department: రైలులో ప్రయాణిస్తున్నా ఇంట్లో ఉన్న అనుభూతి.. అందుబాటులోకి రానున్న సెలూన్‌ కోచ్ లు!

  • ఇప్పటి వరకు మంత్రులు, అధికారులకే పరిమితం
  • ఇకపై సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి
  • అటాచ్‌డు టాయ్‌లెట్‌తో రెండు పడక గదుల సదుపాయం

రైలులో సుదూర ప్రయాణ అవసరం పడిందా...రెండు మూడు రోజుల ప్రయాణం ఎలా గడుస్తుందా అన్న బెంగ పట్టుకుందా... ఇక ఈ భయం ఏం అక్కర్లేదు. ఎంచక్కా రెండు గదుల ఇంట్లో ఉన్న అనుభూతితో మీ ప్రయాణాన్ని పూర్తి చేసుకునే అవకాశాన్ని రైల్వేశాఖ మీ ముందుకు తెస్తోంది. ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు, రైల్వేశాఖ అధికారులకే పరిమితమైన ‘సెలూన్‌’ కోచ్‌ సదుపాయం ఇకపై సాధారణ ప్రయాణికులకు కూడా అందుబాటులోకి రానుంది.

వివరాల్లోకి వెళితే...రెండు పడక గదులు, ఓ లాంజ్‌, టాయ్‌లెట్‌, వంటగదితో కూడిన రైలు బోగీలను ఇకపై సాధారణ ప్రయాణికులకు కూడా అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పర్యాటక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో 336 రైల్వేసెలూన్‌ కోచ్ లు అందుబాటులో ఉండగా ఇందులో 63 కోచ్‌లు ఏసీవి. వీటిలో చాలావరకు త్వరలో సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అంటే ఇంట్లో ఉన్న అనుభూతితో రైలు ప్రయాణం చేసే సదుపాయం అందుబాటులోకి రానుందన్నమాట.

More Telugu News