Sabarimala: గెలిచిన భక్తుల సెంటిమెంట్... అయ్యప్ప దర్శనం లేకుండానే వెనుదిరిగిన కవిత, రేహ్నా!

  • ఆలయం వరకూ మాత్రమే రాగలిగిన ఇద్దరు యువతులు
  • ఆపై ఒక్క అడుగు కూడా తీసుకెళ్లలేకపోయిన పోలీసులు
  • వారికి సర్దిచెప్పి వెనక్కు పంపించిన ఐజీ శ్రీజిత్

శబరిమలలో అయ్యప్ప భక్తులదే విజయమైంది. 10 నుంచి 50 సంవత్సరాల వయసున్న మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు పాటించలేకపోయారు. 100 మంది పోలీసులు ఒకవైపు, 20 వేల మంది భక్తులు మరోవైపు నిలువగా, స్వామి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు యువతులు వెనుదిరగక తప్పలేదు.

హైదరాబాద్ మోజో టీవీ జర్నలిస్టు కవిత, ఎర్నాకులంకు చెందిన రేహ్నా ఫాతిమాలు పోలీసుల సాయంతో ఆలయం వరకూ మాత్రమే చేరుకోగలిగారు. ఆపై వారి ముందు సముద్రంలా భక్తులు అడ్డు నిలవడంతో పోలీసు కార్యాలయానికి తీసుకెళ్లిన ఐజీ శ్రీజిత్, వారికి పరిస్థితిని చెప్పి, వెనుదిరగాలని కోరడంతో అందుకు వారు అంగీకరించారు. ఇదే విషయాన్ని మీడియాకు వివరించిన శ్రీజిత్, మహిళా భక్తులు వెనుదిరిగేలా ఒప్పించామని, పోలీసుల భద్రత నడుమే వారు కొండ దిగుతున్నారని చెప్పారు.

More Telugu News