Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్: ఈక్విటీలను తెగనమ్ముతున్న ఇన్వెస్టర్లు!

  • శుక్రవారం నాడు భారీ నష్టం
  • 432 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
  • నిఫ్టీ-50లో 40 కంపెనీలు నష్టాల్లోనే

భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం నాడు భారీగా నష్టపోయింది. ఈ ఉదయం సెషన్ ప్రారంభం నుంచే విదేశీ ఇన్వెస్టర్లతో పాటు ఫండ్ సంస్థలు ఈక్విటీల విక్రయానికి దిగాయి. రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించాయని మార్కెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 432 పాయింట్లు పడిపోయి 34,347 పాయింట్లకు పడిపోయింది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 153 పాయింట్ల పతనంతో 10,299కి చేరింది.

నిఫ్టీ - 50లో కేవలం 10 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. గెయిల్, ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, హింద్ పెట్రో తదితర కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా, యస్ బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రా సిమెంట్స్ తదితర కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

More Telugu News