ndtv: ఫెమా నిబంధనల అతిక్రమణ.. ఎన్డీటీవీకి నోటీసులు జారీ చేసిన ఈడీ

  • ఫెమా నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో రూ. 2,732 కోట్ల పెట్టుబడులు  
  • రూ. 1,637 కోట్ల విదేశీ పెట్టుబడుల స్వీకరణ 
  • లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్టు గుర్తించాం

ప్రముఖ జాతీయ మీడియా ఎన్డీటీవీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో రూ. 2,732 కోట్ల పెట్టుబడులు పెట్టినందుకు, రూ. 1,637 కోట్ల మేర విదేశీ పెట్టుబడులను అందుకున్నందుకు ఈ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఈడీ ఒక ప్రకటనను ఈ రోజు విడుదల చేసింది.

 రూ. 725 కోట్లను ఎఫ్డీఐ రూపంలో సీసీఈఏ అనుమతులు లేకుండా ఎన్డీటీవీ అందుకుందని ఆరోపించింది. రూ. 600 కోట్లకు మించితే ఎఫ్డీఐకు సీసీఈఏ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, ఈ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపే ప్రయత్నాన్ని ఎన్డీటీవీ చేసిందని ఈడీ తెలిపింది. లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్టు గుర్తించామని... ఫెమా కింద పలు కంపెనీలతో పాటు పలువురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశామని వెల్లడించింది. 

More Telugu News