Indusind bank: డెబిట్‌ కమ్‌ క్రెడిట్‌ కార్డు అందించనున్న ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

  • ఒకే కార్డుతో రెండు అవసరాలు తీర్చుకునే అవకాశం
  • వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలంటున్న యాజమాన్యం
  • ఖాతాదారులకు సౌలభ్యమైన సేవలే లక్ష్యమని ప్రకటన

ప్రస్తుతం అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్‌ కార్డులు జారీ చేస్తున్నాయి. అర్హత ఉన్న వారికి క్రెడిట్‌ కార్డులు ఇస్తున్నాయి. అవసరాల ప్రాతిపదికన ఈ రెండింటినీ వేర్వేరుగా వినియోగించుకోవాలి. ఇకపై ఈ జంజాటం లేకుండా క్రెడిట్‌ కమ్‌ డెబిట్‌ కార్డు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది ఇండస్‌ఇండ్‌ బ్యాంకు.

ఖాతాదారులకు సౌకర్యవంతమైన సేవలందించే లక్ష్యంలో భాగంగా దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దీనివల్ల ఖాతాదారుడు రెండింటినీ వేర్వేరుగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదని, ఒకే సమాచారాన్ని సేవ్‌ చేసుకుని వాడుకోవచ్చని చెబుతోంది. ఈ కార్డులో రెండు మాగ్నటిక్‌ స్ట్రిప్స్‌, రెండు ఈవీఎం చిప్స్‌ ఉంటాయి. డ్యూ కార్డు లాంటి సేవలు ఖాతాదారుల లావాదేవీలను మరింత సులభతరం చేస్తాయని కస్టమర్‌ బ్యాంకింగ్‌ ప్రతినిధి సుమంత్‌కత్‌పాలియా తెలిపారు.

More Telugu News