Cricket: ఇది నమ్మగలరా?... 50 ఓవర్ల మ్యాచ్ లో 571 పరుగుల తేడాతో విక్టరీ!

  • ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో సంచలనం
  • 50 ఓవర్ల మ్యాచ్ లో 596 పరుగులు చేసిన నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌
  • 25 పరుగులకే ఆలౌట్ అయిన పోర్ట్‌ అడిలైడ్‌
  • ఆస్ట్రేలియా ఎస్‌ఏసీఏ పీసీ స్టేట్‌వైడ్‌ క్రికెట్ లో ఘటన

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. ఓ మ్యాచ్ లో 571 పరుగుల తేడాతో విజయం సాధించిందో జట్టు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ స్థానిక టోర్నీలో నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌‌, పోర్ట్‌ అడిలైడ్‌ మహిళల జట్లు ఎస్‌ఏసీఏ పీసీ స్టేట్‌ వైడ్‌ క్రికెట్ టోర్నీలో పాల్గొన్న వేళ, ఈ ఘటన జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టు 3 వికెట్ల నష్టానికి 596 పరుగులు చేయగా, తదుపరి బ్యాటింగ్ చేసిన  పోర్ట్‌ అడిలైడ్‌ జట్టు కేవలం 25 పరుగులకే కుప్పకూలింది.

భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన పోర్ట్‌ అడిలైడ్‌ జట్టు 10.5 ఓవర్లలో 25 పరుగులే చేయగా, నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టు 571 పరుగుల తేడాతో గెలిచింది. నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టులో నలుగురు సెంచరీలు సాధించడం మరో రికార్డు. టెగాన్‌ మెక్‌ ఫార్లిన్‌ 136, టాబీ సవిలీ 120, శామ్‌ బెట్స్‌ 124, డార్సీ బ్రౌన్‌ 117 పరుగులు చేశారు. గుర్తింపు పొందిన క్రికెట్ ఫార్మాట్లలో ఇదే అత్యధిక స్కోరు, భారీ విజయం.

More Telugu News