Telangana: మరో రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు!

  • కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండి

దక్షిణ అండమాన్ సముద్ర తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయం కావచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు కూడా వర్షాలు కురిశాయి. నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, చిత్తూరు, కరీంనగర్, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాలో వర్షాలు కురిశాయి.

More Telugu News