Aravinda Sameth: 'నాన్ బాహుబలి' రికార్డును బద్దలు కొట్టిన 'అరవింద సమేత'!

  • 'బుక్ మై షో డాట్ కామ్'లో 12 లక్షల టికెట్లు అమ్ముడు
  • 'బాహుబలి-2' తరువాత ఇదే అత్యధిక రికార్డు
  • తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 55 కోట్లు వసూలు
  • డిస్ట్రిబ్యూటర్లందరూ సేఫ్ జోన్ లోకి

దసరా సందర్భంగా విడుదలైన ఎన్టీఆర్ కొత్త చిత్రం 'అరవింద సమేత' ఓ నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. ఈ సినిమాకు టికెట్ బుకింగ్ వెబ్ సైట్ 'బుక్ మై షో డాట్ కామ్'లో 12 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఓపెనింగ్ వీకెండ్ అమ్మకాల్లో 'బాహుబలి-2' రెండు భాగాల తరువాత అత్యధికంగా అమ్ముడైంది ఈ సినిమా టికెట్లే. ఈ విషయాన్ని సదరు వెబ్ సైట్ వెల్లడించింది.  ఓపెనింగ్‌ వీకెండ్‌ సేల్స్‌ విషయంలో ‘బాహుబలి–2’ తరువాత ఈ ప్లేస్‌ లో 'అరవింద సమేత వీరరాఘవ' నిలిచిందని, తెలుగులో మంచి మంచి చిత్రాలు వస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమని 'బుక్‌ మై షో' ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాగా, ఇప్పటివరకూ 'అరవింద సమేత' రూ. 115 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుండి షేర్‌ గా రూ. 55 కోట్లు రాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 74 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రూ. 12 కోట్లకు ఈ సినిమాను విదేశాల్లో విక్రయించగా, మంగళవారం నాటికే రూ. 11.30 కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఇక నైజాం హక్కులను 'దిల్' రాజు రూ. 18 కోట్లకు కొనగా, ఆయన డబ్బులు ఆయనకు వచ్చేసినట్టు తెలుస్తోంది. గుంటూరు, సీడెడ్, వెస్ట్‌ గోదావరి డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి కూడా ఇదేనని టాలీవుడ్ అంటోంది. వైజాగ్, కృష్ణా, ఈస్ట్‌ గోదావరి, నెల్లూరు, కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు, ఈ వారం నుంచి లాభాల్లోకి నడుస్తారని అంచనా.

More Telugu News